Home  »  TV News  »  Illu Illalu Pillalu: శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. వేరే అమ్మాయితో తిరుగుతున్నానని చెప్పిన విశ్వ!

Updated : Mar 15, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -419 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే జాబ్ ఇప్పించే బ్రోకర్ వాళ్ళని చూస్తాడు. ఎక్కడ దగ్గరికి వచ్చి మాట్లాడుతాడోనని వాళ్ళని చూసి పరుగెడతారు. 

మరోవైపు ప్రేమ, ధీరజ్ హోలీ ఆడుతుంటారు. అక్కడికే భాగ్యం, ఆనందరావు వస్తారు. విశ్వ, తను యాక్టింగ్ చేయమన్న అమ్మాయితో కలిసి హోలీ ఆడే దగ్గరికి వస్తారు ధీరజ్, ప్రేమ. అక్కడ వాళ్ళని చూసి ఈ బండోడిలో మన్మధుడు కూడ ఉన్నాడా అని వెంటనే శ్రీవల్లికి ఫోన్ చేసి ఈ విశ్వగాడు ఒక అమ్మాయితో ఉన్నాడే వాళ్ళ క్లోజ్ చూస్తుంటే లవర్ లాగా అనిపిస్తుందని భాగ్యం అంటుంది. 

అదంతా నా ప్లాన్ అని శ్రీవల్లి చెప్తుంది. అమూల్య వెనకాల ఉండి, ఇదంతా ఎవరు చేసారో కనిపెట్టడానికి ఇదంతా ప్లాన్ చేసాను. వాళ్ళు కామాక్షి ఇంటిముందే హోలీ ఆడుతున్నారు. దాంతో కామాక్షి చూసి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుంది. దాంతో అసలు నిజం బయటపడుతుందని శ్రీవల్లి చెప్తుంది. భళే ప్లాన్ చేసావ్ అమ్మడు అని భాగ్యం అంటుంది. ప్రేమ, ధీరజ్ ని చూసి శ్రీవల్లికి చెప్తుంది భాగ్యం. మరీ మంచిదే అమ్మ.. ప్లాన్ సులువుగా అవుతుందని శ్రీవల్లి అంటుంది. 

రామరాజు, నర్మద, సాగర్, వేదవతి, చందు, శ్రీవల్లి హోలీ ఆడతారు. మరోవైపు విశ్వ, ఒక అమ్మాయితో ఉండటం ధీరజ్ చూసి.. నా చెల్లికి అన్యాయం చేస్తావా అని అడుగుతాడు. నా ఇష్టం రా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ఏం చేస్తావో చేయిరా అని విశ్వ అనడంతో విశ్వ కాలర్ పట్టుకొని లాక్కెళతాడు ధీరజ్. 

మరోవైపు రేవతి ఏడుస్తుంటే అమూల్య ఓదారుస్తుంది. అప్పుడే భద్రవతి వచ్చి చూసి.. ఏమైందని అడుగుతుంది. నా కూతురి బర్త్ డే ఈ రోజు.. కనీసం ఒక్కపూట అయినా తనకి కడపు నిండా భోజనం పెట్టలేకపోతున్నానని రేవతి ఎమోషనల్ గా అంటుంది. నా మేనకోడలు అంటే నాకు ఇష్టం ఉండదా.. నువ్వు కన్నావ్ అంతే నేను గుండెల మీద మోసానని.. త్వరలోనే మన ఇంటికి వచ్చేస్తుందని భద్రవతి చెప్పి వెళ్ళిపోతుంది. 

మరోవైపు విశ్వని లాక్కొని ధీరజ్ వెళ్తాడు. అప్పుడే రామరాజు ఫ్యామిలీ, భద్రవతి ఫ్యామిలీ వస్తారు. ఏంట్రా నా మేనల్లుడిని ఎందుకు కొడుతున్నావని భద్రవతి అడుగుతుంది. వీడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని కామాక్షి అనగానే అందరు షాక్ అవుతారు. 

వీడు వేరే అమ్మాయితో తిరుగుతుంటే నేను అక్కడి నుండి కొట్టుకొని వచ్చానో లేదో అడగండి అని ధీరజ్ అనగానే రేయ్ విశ్వ వాడు చెప్పేది నిజమేనా అని  భద్రవతి అంటుంది. నేను వాడికే చెప్తానని ధీరజ్ దగ్గరికి విశ్వ వెళ్తాడు. అవునురా తిరిగానని విశ్వ చెప్తాడు‌. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.